తెలంగాణ రాష్ట్రం లో ఉన్న వివిధ శాఖ లల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభ వార్త. వారి ని క్రమబద్దీకరించ డానికి లైన్ క్లీయర్ అయింది. గతం లో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్ఛరర్లను క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ను తీసుకువచ్చింది. అయితే ఈ జీవో నెంబర్ 16 ను వ్యతిరేకిస్తు పలువురు కోర్టు లో పిల్ వేశారు. దీంతో జీవో నెంబర్ 16 ను నిలివి వేస్తు కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. తాజా గా నంబర్ 122\2017 అనే పిల్ ను సీజే జస్టీస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కొట్టి వేసింది.
దీంతో రాష్ట్రం లో ఉన్న కాంట్రాక్ట్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కు మార్గం సుగుమం అయింది. అలాగే ఈ పిటిషన్ వేసిన వారికి రూ. 1,000 చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఈ కేసు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరణ కు అనుకూలం గా వాదించింది. కాగ ప్రభుత్వం జీవో నెంబర్ 16 ను 2016 లో విడుదల చేసింది. అలాగే ఈ జీవో నెంబర్ 16 ను సవాల్ చేస్తు కొంత మంది నిరుద్యోగులు 2017 లో హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇన్ని రోజుల తర్వాత క్లీయర్ అయింది.