సింగరేణి సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు…- బోర్లకుంట వెంకటేష్,ఎంపీ.

-

బీజేపీ కార్మిక, రైతు, దళిత వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోంది. సింగరేణి కార్మికులపై కక్ష సాధించడానికే కేంద్రం బొగ్గు గనులను వేలం వేస్తుందని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ విమర్శించారు. గతంలో 2014లో సింగరేణి కార్మికులను పన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేసి పంపిస్తే.. కేంద్రం దీనిపై ఉలుకు పలుకు లేకుండా ఉంది. బీజేపీ ఎంపీలు మగాళ్లే అయితే దీనిపై బీజేపీ ప్రభుత్వాన్ని, మోదీని ఒప్పించాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, పిచ్చి లేచి అరిచే అరవింద్ లు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 4 బొగ్గు గనుల వేలానికి వ్యతిరేఖంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నామని బోర్లకుంట వెంకటేష్ అన్నారు. కార్మికులు చేపట్లే అన్ని ఆందోళనలకు మద్దతు ఇస్తున్నామన్నారు.

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని.. వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సంక్షేమానికి, సింగరేణి ప్రాంతాల అభివ్రుద్దికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 45 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని..ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు, దళిత వ్యతిరేఖ, మతతత్వ విధానాలను అనుసరిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news