Pushpa : పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు.. గెస్ట్ గా సమంత !

-

పుష్ప సినిమా అభిమానులకు చిత్రబృందం మరో తీపి కబురు చెప్పింది. పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 12వ తేదీన… యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ మాసివ్ లుక్ ను కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కు స్పెషల్ గెస్ట్ గా హీరోయిన్ సమంత హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తుండగా… హీరోయిన్ రష్మిక మందాన నటిస్తోంది. అలాగే సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ, ఫాహద్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news