ఎంఐ-17 హెలిక్యాప్టర్ నడిపిన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహన్ అంత్యక్రియలు శనివారం ఆగ్రాలోని శ్మశాన వాటికలో వేల మంది సమక్షంలో నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కూనుర్ సమీపంలో హెలిక్యాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతిచెందిన విషయం విధితమే.
Innocent young son of Wg Cdr Prithvi Singh Chauhan wear his father's IAF cap during last rites in Agra. May God bless the grieved family 🇮🇳💐🙏🏽
Video: @ravikantabp pic.twitter.com/EYbFOYyMpG— Neeraj Rajput (@neeraj_rajput) December 11, 2021
వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహన్ శవ పేటికను జాతీయ పతాకంతో కప్పి, పూలతో అలంకరించిన సమయంలో కుటుంబ సభ్యులు ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలించిది. పృథ్వీ చౌహన్ ఏడేండ్ల కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) క్యాప్‌ను పెట్టుకుని తండ్రికి సెల్యూట్ చేసిన దృశ్యం కన్నీళ్లు పెట్టించింది.
వింగ్ కమాండర్ పృథ్వీసింగ్ చౌహన్ కుటుంబ సభ్యులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతోపాటు రూ.50లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.