ఆప్ఘనిస్థాన్ కు భారత్ సాయం… మెడిసిన్స్ పంపిన ఇండియా..

-

తాలిబన్లు అధికారం చేజిక్కిచ్చుకున్న తర్వాత నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆప్ఘనిస్తాన్ కు భారత్ మానవతా సహాయం అందించింది. ఆప్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వంతో భారత్ కు అధికారిక సంబంధాలు లేనప్పటికి సాయం అందించింది. అత్యవస అవసరం కింద 1.6 మెట్రిక్ టన్నలు ముఖ్యమైన మందులను ఆప్ఘన్ కు అందించింది. కాబూల్ లోని WHO ప్రతినిధులకు అందించారు. ఈ మందులను కాబూల్ లోని ఇందిరా గాంధీ చిల్డ్రన్ హాస్పిటల్ లో అందించనున్నారు. ఆగస్టులో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత న్యూ ఢిల్లీ నుండి కాబూల్‌కు ఇది మొదటి సహాయం. భారత్ లో ఆప్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వానికి అధికారిక సంబంధాలు లేనప్పటికీ.. దోహాలో, మాస్కోలో రెండు సార్లు విదేశాంగ ప్రతినిధులు చర్చలు జరిపారు.

శుక్రవారం ఆపరేషన్ దేవీ శక్తి ద్వారా ఆప్ఘన్ లో చిక్కుకుపోయిన భారతీయులను, హిందూ – సిక్కు మైనారిటీలను 104 మందిని కాబూల్ నుంచి ఢిల్లీకి కామ్ ఏయిర్ ప్లైట్ ద్వారా తరలించారు. ప్రస్తుతం ఈ విమానం ద్వారానే ఆప్ఘనిస్తాన్ కు భారత్ మెడిసిన్స్ ను పంపింది. ఆగస్ట్‌లో ప్రారంభించిన “ఆపరేషన్ దేవి శక్తి” కింద, ఇప్పుడు మొత్తం 669 మందిని ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత అధికారులు తరలించారు. ఇందులో 448 మంది భారతీయులు మరియు 206 మంది ఆఫ్ఘన్‌లు ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news