విడుద‌లకు ముందే కోట్లు సంపాదిస్తున్న పుష్ప.. బిజినెస్ ఎంతంటే?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న పాన్ ఇండియా లెవ‌ల్ సినిమా పుష్ప విడుద‌ల కు ముందే కోట్లు రూపాయల‌ను తన ఖాతా లో వేసుకుంటుంది. ఈ పుష్ప సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 250 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థియేట‌ర్లు.. ఆడియో రైట్స్ తో పాటు మొత్తం క‌లిసి రూ. 250 కోట్లు వ‌సూల్ చేసింద‌ని తెలుస్తుంది.

అయితే పుష్ప ఫ‌స్ట్ పార్ట్ ను దాదాపు రూ. 250 కోట్ల భారీ బ‌డ్జెట్ తో మైత్రి మూవీ మేక‌ర్స్ తో పాటు ముత్తం శెట్టి మీడియా నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా విడుద‌ల కు ముందే సినిమా కు ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని వ‌సూల్ చేసిన‌ట్టే. ప్ర‌స్తుతం పుష్ప సినిమా ప్ర‌మోష‌న్స్ ప‌నుల‌లో బిజీ గా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన పాట‌లు, టీజ‌ర్, ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతం గా ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా పై భారీ గా అంచనాల నెల‌కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news