బ్రేకింగ్ : ఏపీకి వ‌చ్చిన 15 మంది విదేశీ ప్రయాణికులకు పాజిటివ్

-

ఏపీలో ఇవాళ తొలి ఒమిక్రాన్ కేసు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. విజయనగరం జిల్లాలో రెండు దఫా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంప‌గా… జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది.

ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకుండానే ఒమిక్రాన్ సోకింద‌ని స్పష్టం చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఇందులో ట్విస్ట్ ఏంటంటే… 15 మంది విదేశీ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని వైద్య శాఖ పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్టు తేలింద‌ని వైద్య శాఖ స్ప‌ష్టం చేసింది. ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్య శాఖ భరోసా క‌ల్పించింది. కానీ మాస్క్ లు మాత్రం క‌చ్చితంగా ధ‌రించాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news