రిపబ్లిక్ వేడుకలకు ఈసారి అతిధులుగా ఆ ఐదు దేశాాలు..

-

రిపబ్లిక్ వేడుకలకు మరో నెల రోజులు గుడువు ఉంది. ప్రతీ సారి రిపబ్లిక్ వేడుకలకు భారత దేశం వివిధ దేశాల అధ్యక్షులను అతిథిగా ఆహ్వానిస్తుంది. అయితే ఈసారి మధ్య ఆసియాలోని ఐదు దేశాలను అతిధులుగా ఆహ్వానిస్తోందని తెలుస్తోంది. కజకిస్తాన్, కిర్గిజ్ స్థాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లను గణతంత్ర దినోత్సవ అతిథిగా ఇండియా ఆహ్వానిస్తోంది. 2018లో ఆసియాన్ దేశాలను ఇలాగే ఉమ్మడిగా అతిధులను ఆహ్వనించింది. ఆ తరువాత ఇలా రెండు కన్నా ఎక్కువసార్లు అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మధ్య ఆసియా దేశాలతో భారత్ కు సాంస్కృతిక, నాగరికత మరియు చారిత్రాత్మక సంబంధాలున్నాయి. దీంతో పాటు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా కూడా ఈ ఐదు  దేశాలతో స్నేహం భారత్ కు చాలా అవసరం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఈ ఐదు దేశాలు ఇటు చైనా, ఆప్ఘన్, పాక్ సరిహద్దుల్లో ఉండటం భారత్ కు వ్యూహాత్మకంగా కలిసి వచ్చే అంశం. రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించడం ద్వారా ఈ దేశాలతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఏర్పడుతుంది.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి, భారతదేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), UAE యొక్క Md బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (2017), మొత్తం 10 ASEAN దేశాలు (2018), దక్షిణాఫ్రికా సిరిల్‌లను ఆహ్వానించింది. రమాఫోసా (2019) మరియు బ్రెజిల్‌కు చెందిన జైర్ బోల్సోనారో (2020)లను ముఖ్య అతిధులుగా ఆహ్వానించారు. 2021లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను అతిథిగా ఆహ్వానించారు అయితే.. కోవిడ్ కారణంగా ఆయన రాలేకపోయారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news