గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముప్పతిప్పలు పెడుతోంది. డెల్టా, ఓమిక్రాన్ ల రూపంలో ప్రజలకపైకి దండయాత్ర చేస్తూనే ఉంది. మహమ్మారి వల్ల ప్రపంచంలో 50 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజాగా ఈ నివేదికను వెల్లడించింది. 2020లో కరోనా మహమ్మారి ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించిందని,వివిధ దేశాల్లో వాటి ఆరోగ్య పరిస్థితి.. పరిమితికి మించి విస్తరించని.. ఫలితంగా పదేళ్లలో మొదటిసారిగా ఇమ్యునైజేషన్ కవరేజ్ పడిపోయిందని.. TB మరియు మలేరియాతో మరణాలు పెరిగాయని, WHO మరియు ప్రపంచ బ్యాంక్ పేర్కోంది.
కరోనా కారణంగా 1930 తర్వాత అత్యంత దుర్భర ఆర్థిక పరిస్థితికి కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో .. ప్రజలు పేదరికం వైపు వెళ్తున్నారని అంచనా వేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైనా ఆరోగ్య సదుపాయాలకు కల్పించేందుకు ప్రయత్నించాలని సూచించింది.