హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్..1350 స్వచ్ఛ వెహికల్స్ ప్రారంభం

హైదరాబాద్ ప్రజలకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇవాళ ఒకేసారి1350 స్వచ్ వెహికిల్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుందని.. స్వచ్ హైదరాబాద్, స్వచ్ తెలంగాణలో భాగంగా స్వచ్ వెహికిల్స్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని రంగాల కంటే ముందుందని.. సపాయన్న నీకు సలామన్న అని అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. సపాయి కార్మికులకు గౌరవ వేతనం ఇస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమని.. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ జరుగుతుందన్నారు.

1350 వాహనాలను ఈరోజు ప్రారంభించాం.. మొత్తం చెత్త సేకరణ వాహనాలు 5700 పై చిలుకు వాహనాలు హైదరాబాద్ నగరంలో చెత్త సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే పెద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభించుకున్నాం.. నగరంలోని అన్ని మూలలకు చెత్త సేకరణ వాహనాలు వెళ్తాయని పేర్కొన్నారు. నగరంలోని అన్ని గల్లీలు శుభ్రంగా అవుతున్నాయి, అవుతాయని వెల్లడించారు.