ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ విజయం సాధించడం పై మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా తో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు…ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
కోటిరెడ్డి కి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజారిటీ ఇచ్చి గెలిపించారని పేర్కొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన కాంగ్రెస్ నల్గొండ జిల్లాలో కుట్ర పూరితంగా పని చేసిందని వెల్లడించారు. టీఆరెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఓడి పోయాయని తెలిపారు. ఈ గెలుపు తో టిఆర్ఎస్ పార్టీ ని మరింత బలోపేతం చేసుకుని 12 అసెంబ్లీ స్థానాల్లో12 గెలుచుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ లోని రెండు స్థానాల్లో మొత్తంగా 6 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.