సీఎం జ‌గ‌న్ తో ఫ్లిఫ్ కార్ట్ సీఈఓ భేటీ..ఏపీకి భారీగా పెట్టుబ‌డులు

-

సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఈ సంద‌ర్భంగా విస్తృత చర్చ నిర్వ‌హించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జ‌గ‌న్‌. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం… ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని తెలిపారు.

సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్… ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న ఫ్లిప్‌కార్ట్‌.. నైపుణ్యాభివృద్ధి కోసం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ ప్రాజెక్టులో భాగస్వాములం అవుతామని వెల్లడించింది. సీఎం జ‌గ‌న్‌ దార్శినికత బాగుందన్నారు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ. రైతుల పంటలకు మంచి ధరలు రావాలన్న సీఎం ఆలోచనలు బాగున్నాయని అటు కళ్యాణ్‌ కృష్ణమూర్తి కూడా తెలిపారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఇ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news