ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తం రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను రెండు డోసులు తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి మూడు నెలల తర్వాత క్షిణిస్తుందని యూ కే కు చెందిన లాన్సెట్ పత్రిక తెలిపింది. యూ కే లోని ఎడిన్ బరో యూనివర్సటీ శాస్త్ర వేత్తలు కరోనా వైరస్ పై కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం, పని తీరు గురించి అధ్యాయనం చేశారు. దానిని లాన్సెట్ పత్రిక వెల్లడించింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి మూడు నెలల తర్వాత కరోనా వైరస్ ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోయిందని తెలిపారు.
అయితే కొవిషీల్డ్ బూస్టర్ డోస్ తీసుకుంటే.. ఎంత ప్రమాదం సృష్టించే వేరియంట్ల ను అయినా.. కొవిషీల్డ్ ఎదుర్కొంటుదని తెలిపారు. ఈ విషయం తమ ఆధ్యాయనం లో తెలిందని తెలిపారు. అయితే ఈ సర్వే లో తాము కేవలం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంయుక్తం గా రూపొందిచిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే పరిగణ లోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం 4.4 కోట్ల మంది లో యాంటి బాడీలపై అధ్యాయనం చేశామని తెలిపారు. ఈ ప్రకటన తో భారత్ లో మరో సారి బూస్టర్ డోసు వేయాలనే డిమాండ్ పెరుగుతుంది.