నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు : ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇద్దరు పిల్లలకు చెందిన ఇంస్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయని.. ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారు. నిన్నే లక్నో లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ” ఫోన్ లో ట్యాపింగ్ వదిలేయండి. నా పిల్లల ఇంస్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ పని లేదా? అని ఫైర్ అయ్యారు ప్రియాంక గాంధీ.

priyanka gandhi
priyanka gandhi

తమ ఫోన్ లను టాపింగ్ చేస్తున్నారని… పార్టీ ఆఫీసులోని ఫోన్లని వింటున్నారు… సాయంత్రం కొన్ని రికార్డులను సీఎం స్వయంగా వింటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రియాంక గాంధీ. ప్రతిపక్షాల ఫోన్లను టైపింగ్ చేయడం ఇక్కడి సంస్కృతి అని నిలదీశారు. కాగా సీఎం యోగి తన ఫోన్లను టాప్ చేసి.. తమ సంభాషణలను రికార్డు చేసుకుంటున్నారని… రెండు రోజుల క్రిందట సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలు చేసిన రెండు రోజులకే ప్రియాంక గాంధీ కూడా ఇదే ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.