పత్రికపై రూ.5వేల కోట్ల పరువు నష్టం దావా వేసిన అనిల్ అంబానీ

-

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ విషయంలో కాంగ్రెస్ కు అనిల్ అంబానీ షాకిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రికపై  రూ. 5వేల కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆ పత్రిక రాసిన అసత్య కథనాలపై అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ కాంగ్రెస్ నేతలను పలుమార్లు ఆయన హెచ్చరించారు. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు గాంధీకి కూడా గతంలోనే లేఖ రాశారు. అయినప్పటికీ వారు తమ వైఖరిలో మార్పులేకుండా పలు మార్లు రఫెల్ కుంభకోణం అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో …ముంబాయిలోని సిటీ సివిల్ కోర్ట్ లో రిలయన్స్, రిలయన్స్ ఇన్ ఫ్రాస్టక్చర్, రిలయన్స్ ఎరోస్ట్రక్చర్ సంస్థలు తమ ప్రతిష్ట దెబ్బతినేలా కథనాన్ని ప్రచురించారని నేషనల్ హెరాల్డ్ పత్రికపై పరువు నష్టం దావా వేశారు.

తరచు ఈ విషయమై విమర్శలు చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహెల్ పై కూడా మరో రూ. 5వేల కోట్ల పరువు నష్టం దావా వేయడం విశేషం. దీంతో సెప్టెంబర్ 7లోపు తమ అభిప్రాయాలు కోర్టుకు తెలపాలని నేషనల్ హెరాల్డ్, గోహెల్ ను న్యాయస్థానం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news