చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటీనటులు మరణించగా తాజాగా మరో ప్రముఖ గాయకుడు, నటుడు మృతి చెందాడు. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం మృతి చెందారు. డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్న ఆయన గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అయితే తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. 1943 డిసెంబర్ 10వ తేదీన జన్మించిన మాణిక్య వినాయాగం.. దిల్ అనే తమిళ సినిమాలో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. తరువాత అన్ని భాషల్లో కలిపి 700 పైగా పాటలు పాడాడు. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రంలో “పట్టు పట్టు చెయ్యే పట్టు” అనే పాట తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. పాటలు పాడటమే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేసుకున్నాడు మాణిక్య వినాయగం. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.