గుప్పెడంతమనసు: నేను వస్తా అంటూ రిషీ ఎంట్రీ ఇస్తాడు. నువ్వేంట్రా అని గౌతమ్ అంటే..సప్రైజ్ ఇద్దాం అని వచ్చాను అంటాడు. అలా ముగ్గురూ కలిసి కారులో వెళ్తారు. గౌతమ్ మనసులో..వెదవ కరెక్టు టైంకి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టాడు అనుకుంటాడు. వసుధార మనసులో థ్యాంక్యూ రిషి సర్.. కరెక్ట్ టైమ్ కి వచ్చి నన్ను కాపాడారు, లేదంటే గౌతమ్ ని వదిలించుకునేందుకు టైం పట్టేది అనుకుంటుంది. అటు రిషి కూడా వీడికి సరైన టైంలో అర్థమయ్యేలా చెప్పాలి లేదంటే ఇంకా ఎక్కువ చేసేలా ఉన్నాడని మనసులో అనుకుంటాడు . వసుని జగతి ఇంటిదగ్గర దించుతారు. గౌతమ్ కారు దిగి వసూ లోపలికి వెళ్లే వరకూ వెయిట్ చేస్తుంటే..రేయ్ నువ్వు వచ్చేలా లేవు నేను వెళ్తున్నా అంటే..సరే అని గౌతమ్ కూడా కారు ఎక్కేస్తాడు. వాళ్లు వెళ్లిపోతారు.
జగతి-వసుధార
వసుధార రాగానే రిషి గురించి చెబుతుంది. ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు..ఇందాక మాట్లాడుతుంటే..గుడ్ నైట్ అనేశారు అంటే..జగతి కూడా గుడ్ నైట్ అని చెప్పి లేస్తుంది. ఇప్పుడే వచ్చాను కదా..అప్పుడే గుడ్ నైట్ అంటున్నారేంటి ఏంటి అని వసూ అంటే.జగతి వసూకి క్లాస్ ఇస్తుంది..షార్ట్ ఫిల్మ్ కాన్సప్ట్ మీద వర్క్ చేశావా అంటే వసూ లేదనడంతో..గట్టిగా వేసుకుంటుంది జగతి. మనం మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉండాలి, మాటలు మాత్రమే కాదు..వనభోజనాలు, ఉయ్యాలలు, మెసేజ్ లు , కబుర్లు ఇవేనా అని వసుధారను తిడుతుంది. ఇంతకు ముందులా చదువుపై, జీవితంపై శ్రద్ధ ఏకాగ్రత లేదంటుంది. నీ క్రమశిక్షణ , పట్టుదల ఉప్పులా కరిగిపోతున్నాయి.. రెస్టారెంట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తే బావుంటుంది, ఇష్టం వచ్చినప్పుడు వచ్చే దాన్ని ఇల్లు అనరు..నేను తినేశాను, నువ్వు ఇంకా రాకపోయేసరికి తిని వస్తావ్ అనుకున్నాను..తినకుండా వస్తే వంటచేసుకుని తిను అని కోపంగా వెళ్లి డోర్ వేసుకుంటుంది. వసూ మేడమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు..నేను ఏమనా తప్పు చేశానా అని వసూ ఏడుస్తుంది. జగతి రూంలో.. సారీ వసూ ఇంతకన్నా వేరే మార్గం నాకు లేదు అంటుంది.
రిషి-గౌతమ్
కారులో వస్తున్న రిషీ..వసుని ఇంట్లోంచి పంపించేయమన్నా కదా..జగతి మేడం ఆ పనిలో ఉన్నారా లేదా అనే ఆలోచనలో పడతాడు రిషి. మరోవైపు గౌతమ్ ఇంత సైలెంట్ గా ఉండడం నావల్ల కాదంటాడు. పాటలు పెడతా అని గొడవ పెట్టుకోవడంతో కారు రోడ్డుపక్కన ఆపేసి కిందకు దిగి మంటాడు. రిషీ నీ పద్దతి నాకు నచ్చలేదు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావా..వసుని ఈ టైమ్ లో కలిసే అవసరం ఏంటి.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండని చెబుతాడు. గౌతమ్ చెప్పేది ట్రై చేస్తున్నా..రిషీ షట్ అప్ అంటాడు. నువ్వు నేను వద్దు అనుకున్నా..విధి అనేది మనల్ని కలుపుతుంది..రోడ్డుమీద యాక్సిడెంట్ తో యాక్సిడెంటల్లీ కలిశాం.. నేను వెళ్లి ఆమెను పరిచయం చేసుకున్నానా అంటాడు..నీ స్టూడెంట్ అని తెలియకముందే నాకు పరిచయమైంది..దీనికి నువ్వెందుకు ఫీలవుతున్నావ్ అంటాడు గౌతమ్. నువ్వు నేను ఫ్రెండ్స్..ఫ్రెండ్స్ లానే మాట్లాడుకుందాం.. తనకో గోల్ ఉంది, తనని డిస్ట్రబ్ చేయకు అని చెప్పి..బలవంతంగా గౌతమ్ ని కారు ఎక్కిస్తాడు. గౌతమ్ కోపంగా చూస్తుంటే..రిషీ ఏంట్రా ఆ చూపు అంటే..ఎలా చూడాలో కూడా నువ్వే చెప్తావా అని గౌతమ్ అంటే..రిషీ వసుధార తెలివైన అమ్మాయి.. తను అధ్బుతాలు చేస్తుంది నీ మైండ్ లో ఏమైనా ఉంటే తీసెయ్ అంటాడు రిషీ.
జగతి ఇంట్లో:
తన రూమ్ లో కూర్చుకున్న వసుధార.. జగతి తనని అన్న మాటలన్నీ గుర్తుచేసుకుని పాపం.. బాధపడుతుంది. మేడమ్ ఏంటి..కొత్తగా మాట్లాడుతున్నారు, నేను ఏమైనా తెలిసి తెలియక తప్పు చేశానా..అలా చేయలేదు కదా మరి ఎందుకిలా మాట్లాడుతున్నారు, తన తత్వానికి విరుద్ధంగా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని ఆలోచిస్తుంది వసుధార.
కట్ చేస్తే ఫణీంద్ర-మహేంద్ర-గౌతమ్ ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఫణీంద్ర ఏంటి ప్లాన్స్ అంటూ గౌతమ్ తో మాట్లాడతాడు. ఇంతలో మహేంద్రకి వసుధార కాల్ చేసి ఇప్పుడు జరిగిందంతా చెప్తుంది. మేడమ్ ఎప్పుడు లేనివిధంగా ప్రవర్తిస్తున్నారు సార్..మేడం ఇలా ఉండరు.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని అడిగితే..నాక్కూడా అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. నా ప్రయత్నం నేను చేస్తున్నాను.తనకు ఏదో కొత్త ఆలోచన వచ్చిందమ్మా..అదేంటో నేను తెలుసుకుంటా నువ్వేం బాధపడకమ్మా..అదేంటో నేను చూసుకుంటాను అంటాడు. ఈ మాటలను రిషీ వింటాడు.
జగతి-వసుధార
ఉదయం నిద్రలేచి మళ్లీ వసుధార అదే ఆలోచనలో పడుతుంది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అందరికి చెప్పేబదులు.. డైరెక్ట్ గా అడిగితే ఐపోతుందిగా కదా..అని మేడమ్ దగ్గరకు వెళ్తుంది. రాత్రి మీరెందుకు అలా ప్రవర్తించారు, నేను ఏం తప్పు చేశాను, మీలో మార్పు ఎందుకు వచ్చింది, నావల్ల పొరపాటు జరిగితే ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావ్ అని అడగండి, నన్ను అడిగే హక్కు, నిలదీసే హక్కు మీకున్నాయి మేడమ్..ఎందుకిలా మీకు తెలియని కొత్త వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి మేడం ప్లీజ్ అంటుంది. అప్పుడు ఓపెన్ అయిన జగతి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలి వసు అంటుంది. వసూ ఏం అంటున్నారు అంటే..అర్థంకాలేదా..నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలి.. కారణాలు అడగొద్దు, హాస్టల్ కి వెళ్లిపో అంటుంది. వసూ ఎందుకు మేడమ్ అంటే..కారణాలు అడగొద్దు వసుధార అంటుంది జగతి. నా తప్పేంటో తెలయాలి కదా అని వసూ అంటే..తప్పొప్పులు అనవసరం వెళ్లిపో అన్నాను వెళ్లిపో అంటుంది. నా వల్ల తప్పేంటని మళ్లీ అడగడంతో రిషి పంపించమన్నాడు అని చెబుతుంది జగతి. అవునా..అయితే రిషి సర్ తోనే తేల్చుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జగతి వసూ వసూ అని అరుస్తుంది. ఎప్పటిలాగే..వీళ్లు నుల్చోని కలలు కనేశారు. ఇదంతా జగతి ఊహించుకుంటుందన్నమాట. వసు అడగలేదా అనుకుంటుంది. సమాధానం చెప్పండి మేడం అని వసు అడిగుతుంటే.. కాసేపు నన్ను వదిలేస్తావా ప్లీజ్ అనేసి జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో
మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, నేను తన దగ్గర ఉండడం ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని రిషి తో చెబుతుంది వసుధార. తనికి ఇష్టం లేనప్పుడు ఏదైనా హాస్టల్ లో ఉండొచ్చు కదా అంటాడు రిషి. అయితే ఎవరో ఏదో అన్నారు.. కానీ మేడమ్ చెప్పడం లేదు అంటుంది వసుధార.. నేను హాస్టల్ కి వెళ్లలేను సార్..ఎవరికంటికి కనిపించకుండా వెళ్లిపోతాను అంటుంది. ఇంకోసీన్ లో లగేజ్ బ్యాక్ తీసుకుని ఇంట్లోంచి వస్తుంది. వసుధార. అక్కడే ఉన్న జగతి ఏం మాట్లాడదు. అంటే రేపు వసుధార ఇంట్లోంచి వెళ్లిపోతుందనమాట.