పిల్లలు, తల్లిదండ్రులకు ఆర్టీసీ న్యూఇయర్​ బంపర్​ ఆఫర్​..

-

తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకట్టుకునేలా… కొత్త స్కీమ్ లు, ఆఫర్లు ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 12 సంవత్సరాల లోపు పిల్లలు, తల్లిదండ్రులకు న్యూ ఇయర్ రోజున అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ.

జనవరి ఒకటో తారీఖున పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఉచితమని ప్రకటన చేసింది. 12 సంవత్సరాలలోపు పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం గమనార్హం.

అటు న్యూ ఇయర్ వేడుకలకు అదనంగా బస్ సర్వీస్ లు నడుపాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేక బస్సులు నడపనుంది టిఎస్ ఆర్టీసీ. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతలకు బస్సు సర్వీసులు నడుపాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news