నార్త్ కొరియా చిన్న దేశం అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్. తన నియంతృత్వ పోకడలు పాలన విధానం తో కిమ్ తరచూ వార్తల్లో నిలుస్తాడు. తమ దేశంలో ఆహార సంక్షోభం ఉన్నా మిస్సైల్స్ తయారు చేస్తూ ఇతర దేశాలకు సవాల్ విసురుతాడు. ఏకంగా అమెరికా లాంటి అగ్ర దేశానికే కిమ్ చెమటలు పట్టించాడు. అయితే అలాంటి కిమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.
కానీ మారిపోయింది కిమ్ మనస్సు కాదు శరీరాకృతి. అప్పట్లో కిమ్ అనారోగ్యానికి గురయ్యారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా కిమ్ ఫోటో ఒకటి ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బయట ప్రపంచంలోకి విడుదల చేసింది. అయితే ఈ ఫోటోలో కిమ్ చాలా సన్నబడ్డాడు. అతడి హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. దాంతో దేశంలో ఆహార సంక్షోభం వల్ల కిమ్ తినడం లేదని అందుకే సన్నబడ్డాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.