నేటి నుంచి విజ‌య‌వాడ‌లో బుక్ ఫెయిర్

-

జాతీయ పుస్త‌క మ‌హోత్స‌వం నేటి నుంచి విజ‌య‌వాడ‌లో ప్రారంభం కానుంది. విజ‌య‌వాడ‌లోని స్వ‌రాజ్యం మైదానంలో జాతీయ పుస్త‌క మ‌హోత్సవం నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఈ పుస్త‌క మ‌హోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో ఈ రోజు ప్రారంభింస్తారు. నేటి నుంచి జ‌ర‌గ‌బోయేది 32 వ పుస్త‌క మ‌హోత్స‌వం. ఈ బుక్ ఫెయిర్ నేటి నుంచి ఈ నెల 11 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ రోజ‌ల్లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 : 30 గంట‌ల వ‌ర‌కు బుక్ ఫెయిర్ సంద‌ర్శించ‌డానికి అనుమ‌తి ఉంటుంది.

క‌రోనా నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల‌తో ఈ బుక్ ఫెయిర్ ను నిర్వ‌హిస్తున్నారు. అలాగే మాస్క్ ధ‌రించిన వారికే బుక్ ఫెయిర్ ను సంద‌ర్శించ‌డానికి అనుమ‌తి ఉంటుందని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఇదీలా ఉండ‌గా.. బుక్ ఫెయిర్ మొద‌ట శాత‌వాహ‌న క‌ళాశాల‌లో నిర్వ‌హించాల‌ని భావించారు. కానీ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌నతో స్వ‌రాజ్యం మైదానంలో బుక్ ఫెయిర్ ను నిర్వ‌హిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news