ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

-

దేశ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. మాస్క్ లు, శానిటైజర్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మాల్స్ పై ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా కరోనా కేసులు పెరుగుతే వైద్యం అందించేందుకు గానూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో మళ్లీ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ వేవ్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లలో జిల్లాకు ఒకటి చొప్పున మళ్లీ పునరిద్దరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వైద్యాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దాంతో ఒమిక్రాన్ కట్టడికి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యం లో ఒక్కో సెంటర్ లో 200 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ లు ఏర్పాటు చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news