బ్రేకింగ్ : హైదరాబాద్ కు బండి సంజయ్ తరలింపు

-

క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. నిన్న జన జాగరణ దీక్షకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జీవో 317 ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ… ఈ దీక్షకు పూనుకున్నారు బండి సంజయ్‌. ఈ నేపథ్యంలోనే… నిన్న అర్థరాత్రి బండి సంజయ్‌ కుమార్‌ ను కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో రాత్రి మొత్తం.. బండి సంజయ్‌ ను మానుకొండూరు పీఎస్ కు తరలించారు.

ఆ తర్వాత…మానుకొండూరు పీఎస్ నుంచి బండి సంజ‌య్ ని తరలించారు. మొద‌ట క‌రీంన‌గ‌ర్ పీటీసీ గ్రౌండ్‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు తెలిపిన పోలీసులు… బండి సంజ‌య్‌ని ఎక్క‌డికి తీసుకెళ్లార‌ని స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు పోలీసులు. ఇక ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో బండి సంజ‌య్‌ని హైద‌రాబాద్‌కు త‌ర‌లించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే పోలీస్ స్టేష‌న్ నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం పోలీసులు విడుద‌ల చేశారు. బండి సంజ‌య్ ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారని కార్య‌క‌ర్త‌లు ఆరోపణలు చేస్తున్నారు. అయితే… ప్రస్తుతం బండి సంజయ్‌ ఎక్కడ ఉన్నదనేది క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news