కేటీఆర్‌ మాస్క్‌ పెట్టుకోవడం లేదు.. కేసు వేయండి : రఘునందన్ రావు

-

డిసెంబర్ 25 న తెలంగాణ ప్రభుత్వం కరోనా పై ఉత్తర్వులు జారీ చేసిందని.. ఆ ఉత్తర్వులు తరవాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు… మాస్క్ లేదు.. వేల మంది హాజరు అయ్యారని మండిపడ్డారు రఘునందన్ రావు. ఆ తర్వాత కేటీఆర్‌ నల్గొండ జిల్లా కు వెళ్లారు… నిబంధనలు ఉల్లంఘించారు.. అప్పుడు కేటీఆర్‌ కు మాస్క్ లేదని ఆగ్రహించారు. మరి కేటీఆర్‌ పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

నిన్న కరీంనగర్ లో గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ పెట్టాడు మాస్క్ లేదు.. వీరికి వర్తించని నిబంధనలు తన కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ కార్యక్రమం పెట్టుకుంటే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ వివాదాస్పదుడని.. కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించబడదని చెప్పారు.

కేసీఆర్ పీకే సలహాలు తీసుకోవడం లేదట… టికే ఇస్తున్నాడు అంట అంటూ చురకలు అంటించారు. ఓల్డ్ సిటీ లో హైదరాబాద్ ఎంపీ వేల మంది తో కార్యక్రమం నిర్వహిస్తున్నారు… ఎంత మంది మీద కేసు పెట్టారని నిలదీశారు. డీజీపీ గారు మీరు కూడా సోకు ఉంటే రాజకీయాల్లోకి రండి అంటూ ఫైర్‌ అయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని… పదవుల కోసం పెదవులు మూయకండని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news