మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి తీరుతాను… నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించ లేరు.- జేపీ నడ్డా..

-

తెలంగాణలో క్యాండిల్ ర్యాలీ కాక రేపుతోంది. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఈ రోజు బీజేపీ పార్టీ సికింద్రాబాద్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపింది. ఈ ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానుండటంతో టెన్షన్ నెలకొంది.

కాగా.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని జేపీ నడ్డాకు తెలిపేందుకు జాయింట్ సీపీ కార్తికేయ ఏయిర్ పోర్టుకు వెళ్లారు. ఈక్రమంలోనే జేపీ నడ్డాను కలిసిన జాయింట్ సీపీ కార్తికేయ పరిస్థితులను వివరించారు. జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చారు.

దీనిపై స్పందించిన జేపీ నడ్డా..నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని.. నేను తప్పకుండా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్తానని స్పష్టం చేశారు. సీపీ కార్తికేయ నాకు అనుమతులు లేవని చెప్పారని అన్నారు. బాధ్యతాయుత పౌరుడిగా నేను కోవిడ్ నిబంధనలను పాటిస్తానని.. ప్రజాస్వామ్య పద్దతిలో గాంధీని నివాళులు అర్పిస్తానని వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news