ధర్మపురి అర్వింద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

-

నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన.. సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు మేరకు 5 టౌన్ పోలీసులు ఎంపీ అరవింద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్ 31వ తేదీన హైదరాబాద్లోని చంచల్ గూడ జైలు సమీపంలో ఎంపీ అరవిందు మీడియాతో మాట్లాడుతూ… అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

దళిత సమాజాన్ని కించ పరిచేలా మాట్లాడిన ఎంపీ అరవింద్ ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులు సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తులు… చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని వెల్లడించారు. ఇక తాజాగా ఎంపీ అరవింద్ పై మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news