కేసీఆర్ ప్రేమ అంటే..కడుపులో కత్తి దించినట్లే : వైయస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. కేసీఆర్ ప్రేమ అంటే..కడుపులో కత్తి దించినట్లేనని చురకలు అంటించారు. రైతుల మీద కెసిఆర్ గారి ప్రేమంటే కడుపులో కత్తిదించి కౌగిలించుకొన్నట్టేనని… రుణమాఫీ బందు, ఇన్ పుట్ సబ్సిడీ బందు, పంట బీమా బందు, ఉచిత ఎరువులు బందు. సబ్సిడీ విత్తనాలు బందు చేశాడని అగ్రహించారు.

ఇచ్చేది ఒక్కటే రైతు బంధు అని… సర్వరోగ నివారిణి రైతు బంధు అన్నట్లు రైతులకు సాయం చేసే మిగిలిన అన్ని పథకాలను బందు పెట్టారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. రైతులకు 25 వేలిచ్చే దగ్గర 5 వేలే ఇచ్చి నష్టం చేశారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వైఎస్ షర్మిల.

వరి వేస్తే ఉరేనని, రైతు బంధు పైసలు ఇచ్చేది లేదన్న దొర.. వ్యతిరేకత రావడంతో ప్రతి ఒక్కరికి ఇస్తామని వారోత్సవాలు చేసుకొంటున్నారని మండిపడ్డారు. గప్పాలు కొట్టుడేకాని రైతును ఆదుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దంటూ అగ్రహించారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news