చిట్టి పొట్టి బట్టలతో ప్రాక్టీస్.. ఊ అంటావా మామా మేకింగ్ వీడియో వైరల్…!

-

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతోంది. ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది. ఇక ఈ సినిమాలో అన్నింటితో పాటు ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ హైలెట్ గా నిలిచింది.

సమంత మొదటి సారిగా తన కెరీర్ లో ఐటమ్ సాంగ్ చేసింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ సాగిన ఈ పాట థియేటర్ లో ఆడియన్స్ తో స్టెప్పులు వేయించింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల అయింది. ఈ పాటలో సమంత చిట్టి పొట్టి బట్టలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో లో ఈ పాట కోసం తనను చాలా కష్ట పెట్టారు అంటూ సమంత చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news