గడీలు బద్దలు కొట్టి…కెసిఆర్ ను తరిమి తరిమి కొడతామని : బండి సంజయ్

గడీలు బద్దలు కొట్టి…కెసిఆర్ ను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు బండి సంజయ్. బండి సంజయ్ పై జరిగిన దాడి, అక్రమ కేసుల పూర్వాపరాలను మాజీ సిఎం రమణ్ సింగ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. ఘటనను గురించి తెలుసుకునేందుకు చత్తీష్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఇక్కడికి వచ్చారన్నారు.

డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని.. తెలంగాణలో రాక్షస, నియంత, గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తోందని… ఇంతటి గొప్ప పార్టీలో కొనసాగడం మా అద్రుష్టం భావిస్తున్నానని వెల్లడించారు.

ఘటనలో జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు అయినా మౌనంగా ఉండటం బాధేస్తోందని.. మాకు జైలు కొత్త కాదు ఎన్నోసార్లు జైలుకు వెళ్లామని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే, దళిత మహిళ అని చూడకుండా ఆమెకు ఈ ఘటనతో సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. నేను కోవిడ్ నిబంధనలను పాటించి ‘జాగరణ’ చేస్తే సీఎంకు వచ్చిన నొప్పి ఏంది ?ఇప్పటికైనా 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.