హీరోయిన్ త్రిషకు క‌రోనా పాజిటివ్

-

క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తుంది. సామాన్యులే కాకుండా రాజకీయ నాయ‌కులు, సెల‌బ్రెటీలు ఇలా ఎలాంటి భేదాలు లేకుండా అంద‌రికీ క‌రోనా వైర‌స్ సోకుతుంది. టాలీవుడ్ లో చాలా మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. హీరో మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, మీనా తో పాటు చాలా మంది న‌టీన‌టుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. తాజా గా స్టార్ హీరోయిన్ త్రిష కూడా కరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని హీరోయిన్ త్రిష త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే త‌న‌కు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం వైర‌స్ నుంచి కోలుకుంటున్నాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని వివ‌రించింది. అయితే తాను ఇప్ప‌టికే రెండు డోసుల టీకాలు తీసుకున్నాన‌ని తెలిపింది. అందువ‌ల్ల క‌రోనా వ‌చ్చినా.. ఆరోగ్యంగా ఉన్నాన‌ని త్రిష తెలిపారు. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ త‌ప్ప‌ని స‌రి ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని సూచించిచారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news