కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు అని రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్పీ వీడియో చేశాడు. దీంతో వనమా రాఘవ ను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అయితే వనమా రాఘవ పరారు కావడంతో 8 బృందాలతో గాలించారు. అయితే తాజా గా నిన్న రాత్రి వనమా రాఘవ ఆచూకీ తెలియడంతో.. పోలీసులు అరెస్టు చేశారు.
వనమా రాఘవతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వనమా రాఘవను పాల్వంచలోని సబ్ డివిజన్ కార్యాలయంలో నేడు తెల్లవారు జాము వరకు పోలీసుల ఈ కేసులో విచారించారు. అయితే ఈ కేసులో వనమా రాఘవ ఏ-2 గా ఉన్నాడు. కాగ ప్రస్తుతం వనమా రాఘవ పాత కేసులను కూడా బయటకు తీసి విచారణ చేపడుతున్నారు. అంతే కాకుండా వనమా రాఘవ పై రౌడీ షీట్ నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగ ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించారు.