చిత్ర పరిశ్రమ పెద్దలపై నెల్లూరు జిల్లా కోవూరు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అని…. అసలు వాళ్ళకి ఏపీ ఉందని అసలు గుర్తుందా అని నిలదీశారు. పెద్ద సినిమాల టికెట్లను 1000 నుంచి 2000 అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
సినిమా టికెట్ల రేట్లు తగ్గితే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారనే నేపథ్యంలోనే… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ నిర్ణయంలో అసలు ఏం తప్పు ఉందని… ఇంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా…సినిమా టికెట్ల వ్యవహారంపై ఇవాళ టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టికెట్లపైనే వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోంది. అయితే… వీరి భేటీ అనంతరం.. సినిమా టికెట్ల వ్యవహారం కుదుటపడుతుందో చూడాలి.