BREAKING : మంత్రి పేర్ని నానితో ముగిసిన సమావేశం..ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

-

కాసేపటి క్రితమే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తో టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ సమావేశం ముగిసింది. దాదాపు ఈ సమావేశం 2 గంటలకు పైగా జరిగింది. ఇక ఈ సమావేశం అనంతరం టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ మీడియా తో మాట్లాడారు. మంత్రి పేర్నినానితో చర్చలు సంతృప్తిగా ముగిశాయి… సినిమా టిక్కెట్ల రేట్లపై నా అభిప్రాయాన్ని చెప్పానని వెల్లడించారు… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వస్తుందని భావిస్తున్నానని వెల్లడించారు ఆర్జీవీ.

రేట్ల తగ్గింపు తో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని… అందుకే సినిమా తీసిన నిర్మాత ధరను నిర్ణయించుకోవాలని ప్రభుత్వానికి వెల్లడించినట్టు ఆయన తెలిపారు. థియేటర్ల మూసివేత.. నాకు సంబంధించిన అంశం కాదన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇదంతా ప్రభుత్వం చేస్తుందని తాను అనుకోవడం లేదని ఆర్జివి పేర్కొన్నారు. తాను ఒక సినిమా నిర్మాతగానే ఇక్కడికి వచ్చానని మరోసారి గుర్తు చేశారు ఆర్జివి. సినిమా టికెట్ల వివాదంపై త్వరలోనే.. క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.

సినిమా తీసే వాళ్ళకి సినిమా టికెట్ నిర్ణయించే అవకాశం ఉండాలని.. నా అభిప్రాయం ప్రభుత్వంతో చెప్పడానికి మాత్రమే వచ్చానని పేర్కొన్నారు.నేను ట్విట్టర్ లో పెట్టిన అన్ని ప్రశ్నలు మంత్రి పేర్ని నాని దగ్గర చెప్పానని.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. ఈ సమస్యకు కంక్లూజిన్ ఇచ్చే పవర్ నాకు లేదని.. మాన్యుఫాక్చరర్ కు వినియోగదారులకు మధ్య ప్రభుత్వం ఎందుకు ఉండాలి అన్నదే నా ప్రశ్న అని పేర్కొన్నారు. ఇప్పటికి నా ప్రశ్న ఇదేనని.. పేర్ని నానితో సమావేశం పట్ల 100 శాతం సంతృప్తిగా ఉన్నానన్నారు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news