పాల్వంచ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవను ఇప్పటి కే అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. అలాగే ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
అయితే పాల్వంచకు చెందని నాగ రామకృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ బెదింరిచారని, వేధింపులకు గురి చేశారని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వనమా రాఘవ ను పోలీసులు ఎనమిది బృందాలతో గాలించి చివరికి అరెస్టు చేశారు. అలాగే రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో రామకృష్ణ తల్లి, సోదరి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఏ-2 గా వనమా రాఘవ ఉన్నాడు. అలాగే ఏ-3 గా రామకృష్ణ తల్లి, ఏ-4 గా రామ కృష్ణ సోదరి ఉంది. దీంతో పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.