ఒమిక్రాన్ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఆదివారం కూడా పనిచేయాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలలో రాత్రి 10 గంటల వరకు పీహెచ్సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు, ఆ తర్వాత టెస్టింగ్, వ్యాక్సినేషన్లను విస్తృతంగా నిర్వహించాలన్నారు. కేసులు తగ్గే వరకు ఈ కొత్త రూల్ అమల్లో ఉంటుందన్నారు.