దేశంలో కొవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో భారత్ బయోటెక్ ఉపశమనం కలిగించే వార్త తెలిపింది. కొవిడ్ వేరియంట్స్ డేల్టా, ఒమిక్రాన్‌లపై కోవ్యాక్సిన్ బూస్టర్ షాట్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తమ ట్రయల్స్‌లో తేలిందని పేర్కొన్నది. కోవ్యాక్సిన్ బూస్టర్డ్ సెరా న్యూట్రలైజేషన్ యాక్టివిటీని ఓమిక్రాన్ వ్యతిరేకంగా పనిచేసే ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ బూస్ట్ చేసిన సెరాలో గమనించి దానితో పోల్చవచ్చు అని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాకు చెందిన ఏమొరై యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం ఉటంకిస్తూ భారత్ బయోటెక్ ఓ ప్రకటన చేసింది. కోవ్యాక్సిన్ సెకండ్ డోసు తీసుకున్న ఆరు నెలల వ్యవధిలో బూస్టర్ డోస్ తీసుకున్న 90శాతం మందిలో సమర్థవంతమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నది.
కోవ్యాక్సిన్ మూడో డోసు ఎంతో సురక్షితమని తమ విశ్లేషణలో తేలిందని, కొవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.