సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి పటాన్ చెరువై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటుగా నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమావేశానికి వచ్చినా.. నేతలు హాజరు కాలేదు. దాంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరి నేతల తీరు. అయితే తన సమావేశానికి ఇద్దరు నేతల గైర్హాజరు పై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు.
అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత నుండి.. పార్టీ పై గుర్రుగా ఉంటున్నారు కాట శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ లో చేరిన తర్వాత జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో పాటుగా నియోజకవర్గ ముఖ్య నాయకులతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు శ్రీనివాస్ గౌడ్. ఇక పటాన్ చెరు నుంచి ఈ సమావేశానికి నీలం మధు, గాలి అనిల్ హాజరు అయ్యారు. అయితే ఇటీవల చిట్కుల్ లోను మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి కూడా కొందరు ముఖ్య నేతలు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.