ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణ తరహాలోనే సంక్రాంతి సెలవులను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తొలగిస్తారని ఉదయం నుంచి అందరూ భావించారు. అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.
ఏపీలో విద్యా సంస్థలకు సెలవు లను పొడిగించే యోచనలో ప్రభుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలను నడిపిస్తామని పేర్కొన్నారు. యధావిధిగా రేపటి నుంచి విద్యాసంస్థలు పున ప్రారంభం కానున్నట్లు ప్రకటన చేశారు.
దీనిపై ఎలాంటి ఇ వదంతులు నమ్మకూడదని సూచనలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి హాలిడేస్ ను పెంచింది కేసీఆర్ సర్కార్. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థలు మూతపడనున్నాయి.