“అనగనగా ఒకరాజు” అంటూ వచ్చేసిన నవీన్ పొలిశెట్టి.. ఇక కామెడీ జాతర షురూ

-

జాతి రత్నాలు సినిమా బంపర్ విజయం సాధించడంతో హీరో నవీన్ పొలిశెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న అనుష్క మూవీ లో ఛాన్స్ కొట్టేసిన హీరో నవీన్ పొలిశెట్టి… తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు.కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో… “అనగనగా ఒక రాజు” అనే సినిమాను నవీన్ పోలిశెట్టి అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఈ సినిమా మా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ టీజర్ ను.. విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పెళ్ళికొడుకు గెటప్ లో అందరినీ కనువిందు చేశాడు. మొత్తానికి ఈ టైటిల్ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news