అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగా : ఆర్జీవీ

-

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ తన ట్వీట్ లతో హాట్ టాపిక్ గానే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఆర్జీవి మెగాఫ్యామిలీపై అప్పుడప్పుడు విమర్శలు కురిపిస్తాడన్న సంగతి తెలిసిందే. కానీ అల్లుఅర్జున్ పై మాత్రం సమయం దొరికినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఆర్జివి అలాంటి పనే చేశారు. మెగా ఫ్యామిలీ లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే.

కానీ వర్మ చేసిన ట్వీట్ లో “కష్టతరమైనదే కానీ కాదనలేని వాస్తవం ఏంటంటే అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగా” అంటూ వర్మ పేర్కొన్నాడు. అంటే ఆర్జీవీ మిగతా మెగా హీరోలపై ఇండైరెక్టుగా సెటైర్ వేశారు. ఇక వర్మ చేసిన ట్వీట్ పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప సినిమాపై అల్లుఅర్జున్ నటనపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అంటూ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news