భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన బన్నీ… కొత్త సినిమాకు రూ. 75 కోట్లు డిమాండ్

-

పుష్ప భారీ విజయంతో జోరు మీదున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప మూవీ అన్ని భాషల్లో భారీ విజయాన్నిఅందుకుంది. అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ లో వచ్చిన కలెక్షన్లు చూసి అక్కడ సినీ ప్రముఖులే ఆశ్చర్చపోతున్నారు. ఓ సౌత్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడంతో ముక్కునవేలేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడు. తను చేయబోయే కొత్త సినిమాకు సుమారుగా రూ. 75 కోట్లు వసూలు చేశాడు. లైకా ప్రొడక్షన్ నిర్మించే సినిమా కోసం ఈ భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బన్నీ అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అట్లీ లేదా మురగదాస్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు పుష్ప సినిమా కోసం రూ. 50 కోట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news