Akshar Patel : ప్రియురాలితో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం..

-

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్… త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిన్న 28వ పుట్టినరోజు సందర్భంగా.. సర్దార్ పటేల్ దానిని మరింత మధురంగా మార్చుకున్నాడు. తన ప్రియురాలు మెహతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అక్షర్ పటేల్. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అక్షర్ పటేల్ షేర్ చేశాడు.

తన సహచరుడు.. భారత స్పిన్నర్ చాహల్ సహా పలువురు క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత… అతడి గుజరాత్ టీం మెంట్ చింతల్ గాయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో అక్షర్-మేహ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశాడు. అక్షర్ పటేల్ మోకాళ్లపై నిల్చొని ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంది. అలాగే ప్రేమ గుర్తుతో పాటు… మ్యారి మీ అని బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండగా… పూలతో చెక్కిన లవ్ సింబల్ పై వారిద్దరు నిలిచిన ఫోటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news