వేసవి కంటే కూడా చలికాలంలో ఎక్కువసార్లు మూత్రం వస్తూ ఉంటుంది. తక్కువ నీళ్లు తాగినా సరే చలికాలంలో ఎక్కువ సార్లు మూత్రం వస్తూ ఉంటుంది. అయితే చలికాలంలో ఇలా రావడం అనేది చాలా సాధారణం. ఆరోగ్య నిపుణులు కూడా చలికాలంలో ఎక్కువ సార్లు మూత్రం వస్తుందని చెప్తున్నారు.
టెంపరేచర్ కారణంగా ఎక్కువ సార్లు యూరిన్ వస్తూ ఉంటుంది. అయితే చలికాలంలో 5 నుండి 6 సార్లు యూరిన్ కి వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజుకి నాలుగు నుండి పది సార్లు మూత్రం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే దీని కంటే ఎక్కువ సార్లు వెళ్లడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఉండే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఆ సమస్యలు ఏమిటో చూద్దాం.
ఓవర్ యాక్టివ్ యూరినరీ బ్లాడర్ :
ఓవర్ యాక్టింగ్ యూరినరీ బ్లాడర్ కారణంగా ఎక్కువ సార్లు మూత్రం వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్లాడర్ ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువ కలెక్ట్ చేయలేదు లేదా ఎక్కువ ఒత్తిడి దాని మీద పడుతుంది. ఈ సమస్య కనుక మీకు ఉంటే ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది. అలాగే యూరిన్ హోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది.
షుగర్ లెవెల్స్ పెరగడం:
డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తారు. టైప్ 2 డయాబెటిస్ వాళ్లకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది అలానే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కలుగుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:
ఎక్కువసార్లు మూత్రం వస్తుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. కొద్దిగా, జ్వరం వాంతులు కూడా ఉంటాయి. ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉంటుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్:
తక్కువ నీళ్లు తాగితే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది. అలానే మంట కూడా ఉంటుంది.