ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ కేబినేట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినేట్ సమావేశం… దాదాపు రెండు గంటల పాటు జరిగింది. అయితే.. ఇవాళ సమావేశమైన ఏపీ కేబినేట్… ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపునకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 కు చేరనుంది.
అలాగే… పీఆర్సీ అమలు పై ఉద్యోగులకు నచ్చ చెప్పడానికి ఓ ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. మంత్రులు, సీఎస్ తో కమిటీ ఏర్పాటైంది. మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన, సజ్జల, సీఎస్ తో కమిటీ ఏర్పాటైంది. వీరంతా ఉద్యోగులతో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేయనున్నారు.కాగా.. అటు ఏపీ ఉద్యోగులు మాత్రం… జగన్ సర్కార్ పై చాలా అసంతృప్తి గా ఉన్నారు. వచ్చె నెలలో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.