ఏపీలో పీఆర్సీ వ్యవహారం చాలా సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… ఇవాళ ఉద్యోగులను శాంతి పరిచేందుకు మంత్రులతో కూడిన కమిటీ వేసింది. అయితే.. కమిటీ వేయడంపై ఏపీ ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం సంప్రదింపుల కోసం కమిటీ ఏ ఉద్దేశ్యంతో వేసిందో మాకు తెలీదని… సహజంగా పీఆర్సీ ప్రకటనకు ముందు మంత్రుల కమిటీ వేస్తారని వెల్లడించారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదంతా రివర్స్ వ్యవహరంగా ఉంది.. పీఆర్సీని ప్రకటించి మంత్రుల కమిటీని వేశారని నిప్పులు చెరిగారు. మంత్రుల కమిటీ వేయడం ద్వారా ప్రభుత్వం మెత్తబడినట్టుగా మేం భావించలేమన్నారు. గతంలోనే ఇదే విధంగా మెత్తబడినట్టు కన్పించి.. పీఆర్సీ జీవోలు జారీ చేశారని పేర్కొన్నారు. సెక్రటేరీయేట్టులో జరిపే సమావేశంలో ప్రభుత్వం వేసిన కమిటీ మీద కూడా చర్చిస్తామని చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటి కైనా.. ఓ మెట్టు దిగి వచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.