ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగింపు.. సీఎం ప్రతిపాదనలను తిరస్కరించిన ఎల్జీ

-

దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగనుంది. కేజ్రీవాల్ ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు. ఢిల్లీలో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మూడు ఆంక్షలను తొలగించాలని కోరుతూ.. లెఫ్టినెంట్ గవర్నర్ కు శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఈమూడింటితో కేవలం ఒకదానికి మాత్రమే ఎల్జీ ఆమోదం తెలిపారు. ఢిల్లీలో ఇటీవల కోవిడ్ కేసులు పెరగడంతో… వీకెండ్ కర్ఫ్యూతో పాటు దుకాణాలకు సరిబేసి విధానంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ వంటి ఆంక్షలు విధించింది. వీటిలో ఎల్జీ కేవలం వర్క్ ఫ్రం హోమ్ ఆంక్షల సడలింపుకు మాత్రమే ఓకే చెప్పారు. ఢిల్లీలో అన్ని ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.

ఇదిలా ఉంటే ఢిల్లీలో పెరిగిన కేసులతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే వీటిపై వ్యాపారుల్లో కాస్త వ్యతిరేఖత పెరుగుతోంది. సరి బేసి విధానం వల్ల నెలలో కనీసం 10 రోజులు కూడా దుకాణాలు నడపలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news