నా మీద పోటీ చేయడానికి గుడివాడలో టీడీపీ అభ్యర్థే లేడు: కొడాలి నాని

-

సొంత మామను వెన్నుపోటు పొడిచి.. చంపడానికి కూడా వెనుకాడని చంద్రబాబు కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టాలని నాని పిలుపునిచ్చారు.

గుడివాడ వైఎస్సాఆర్సీపీ నాయకుడు కొడాలి నాని.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ప్రజలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Kodali Nani slams on chandrababu

ఈసందర్భంగా మాట్లాడిన నాని.. చంద్రబాబును విమర్శించారు. గుడివాడలో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజల మేలు కోరి మోసాలు, ద్రోహాలు, వెన్నుపోట్లు గురించి ఆలోచించని నేత జగన్ ను చూసి తనకు ఓటేయాలని నాని పిలుపునిచ్చారు. జగన్ తమకన్నా వయసులో మాత్రమే చిన్నోడని.. మిగితా అన్ని విషయాల్లో చాలా గొప్పోడని కొనియాడారు.

గుడివాడలో తన మీద పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థే దొరకలేదని నాని తెలిపారు. టీడీపీలో ఉన్న 40 వేల మందిలో తనతో పోటీ పడే నాయకుడే లేడా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుడివాడలో అభ్యర్థి దొరకక.. బయటి నుంచి తీసుకొచ్చి పోటీలో దించుతున్నారని తెలిపారు. ఎవరిని తీసుకొచ్చినా గెలుపు మాత్రం వైఎస్సాఆర్సీపీదే అని స్పష్టం చేశారు.

సొంత మామను వెన్నుపోటు పొడిచి.. చంపడానికి కూడా వెనుకాడని చంద్రబాబు కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టాలని నాని పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news