టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఐసీసీ. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టిమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందంటూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ నియామవాళిలోని అర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవరల్ల కంటే ఒక ఓవర్ తక్కువగా 20 శాతం ఫైన్ విధిస్తారు.
కాగా.. మూడో వన్డేలో కేఎల్ రాహుల్ టీం.. నిర్థీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం ఫైన్ వేసింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కొత పడనుంది. మూడో వన్డేలో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆన్ పీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, బొంగాని జెలే, థర్డ్ అంపైర్ పాలేకర్, నాలుగో అంపైర్ అడ్రియన్ హోల్డ్ స్టాక్ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. టీమిండియాను విచారించకుండానే ఫైన్ వేసింది ఐసీసీ.