సోష‌ల్ మీడియాల‌కు ఏపీ హై కోర్టు మొట్టికాయలు

-

సోష‌ల్ మీడియాలో ఉన్న న్యాయమూర్త‌లు, కోర్టుల ప‌ట్ల అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌ల పై ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ విచార‌ణ‌లో ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టు మొట్టికాయ‌లు వేసింది. సీబీఐ, రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ లేఖ‌లు రాస్తే ఎందుకు స్పందించ‌డం లేద‌ని ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ప్ర‌తినిధుల‌ను హై కోర్టు ప్ర‌శ్నించింది. అలాగే విచార‌ణ‌లో భాగంగా ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, యూట్యూబ్ ల‌లో న్యాయ‌మూర్తులు, కోర్టుల ప‌ట్ల అస‌భ్య‌క‌ర‌మైన పోస్టుల‌ను తొల‌గించాల‌ని తాము చాలా సార్లు లేఖ రాశామ‌ని సీబీఐ న్యాయ‌వాది హై కోర్టుకు తెలిపాడు.

అలాగే తాము కూడా లేఖ రాసిన ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేద‌ని రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ హై కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చాడు. దీంతో ట్విట్ట‌ర్ , ఫేస్ బుక్, యూట్యూబ్ ల‌పై హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీబీఐ, రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ రాసిన లేఖ‌లకు ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించింది. ఇక నుంచి ఆదేశాల‌ను పాటించాల‌ని ఆదేశించింది. అలాగే ఈ కేసు విచార‌ణ‌ను ఈ నెల 31 వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news