ఓటీటీలో ‘83’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే…?

-

బాలీవుడ్ హిట్ సినిమా ‘83’ ఓటీటీ లో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. స్టోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ కథాంశం ఆధారంగా సినిమాని నిర్మించారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణే లీడ్ క్యారెక్టర్లలో నటించారు. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్, ఆయన భార్యగా దీపిక నటించారు. క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే క్రమంలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు… వాటిని ఎదుర్కొని వెస్టిండీస్ జట్టుపై ఫైనల్ ఎలా గెలిచారనే పాయింట్ ఆధారంగా సినిమాను నిర్మించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే సినిమా భారీ సక్సెస్ అయింది.

తాజాగా 83 సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. ఫిబ్రవరి 18 నుంచి నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ ఓటీటీల్లో ఈసినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. 83 హిందీ లాంగ్వేజ్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది. డీస్నీ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news