సిక్స్ ప్యాక్ డైట్ ఆరోగ్యానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో తెలుసా..!

-

ఈ రోజుల్లో సిక్స్ ప్యాక్ బాడీ కావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అలాగే కొంతమంది అమ్మాయిలు సైజ్ జీరోగా మారాలని అనుకుంటారు. తక్కువ టైంలో ఎక్కువ షేప్ కోసం.. వీళ్లు ఇక జిమ్ లో తెగ కష్టపడుతుంటారు. అయితే ఎవరైతే.. సిక్స్ ప్యాక్ బాడీతో, సైజ్ జీరోతో ఉంటారు.. వారు చూడ్డానికి అందంగా ఉంటారేమో కానీ.. ఆరోగ్యంగా అయితే ఉండరని ప్రముఖ ప్రకృతి వైద్యనిపుణులు అంటున్నారు.

వాళ్లు అలా మెయింటేన్ చేయడం కూడా కష్టమే. కాదని అలానే మెంయిటేన్ చేయాలనుకుంటే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..తీవ్ర శ్రమతో పాటు.. మంచి పోషకాహారం తీసుకోవాలి. సాధారణంగా..ఈ సిక్స్ ప్యాక్ కానీ సైజ్ జీరో వాళ్లు కానీ..ఎక్కడా కొవ్వు లేకుండా.. చెక్కినట్లు మంచి షేప్ లో ఉంటారు. కొవ్వు లేకపోతే..ఆరోగ్యానికి మంచిదే కదా..మరి వాళ్లు ఎందుకు ఆరోగ్యంగా ఉండరు అంటున్నారు అంటే.

బాడీ ఆ స్టేజ్ కి రావడానికి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావడానికి వారు తీసుకునే డైట్స్ బాడీ ప్రిన్సిపల్స్ కు 100% రివర్స్ లో ఉంటాయట. నేచర్ ఎక్కువ కార్భోహైడ్రేట్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఫ్యాట్, ప్రోటీన్. ఇలా ఆర్డర్ ఉంటుంది. కానీ ఈ సిక్స్ ప్యాక్ ట్రై చేసేవాళ్లకు ఈ ఆర్డర్ రివర్స్ లో ఉంటుంది. ఫస్ట్ ప్రోటీన్, ఫ్యాట్ ఆఖరికి కార్బోహైడ్రేట్స్. అంటే ఈ శరీరాన్ని మనం రివర్స్ ఎలా ఉంటుంది.

అలానే అవుతుంది ఇక్కడ. ఈ సిక్స్ ప్యాక్ రావాలంటే.. పొరలు పొరలు కనబడాలంటే..కొవ్వు అంతా కరిగిపోవాలి. కార్భోహైడ్రేట్స్ ను కంప్లీట్ జీరో చేస్తారు. ఒక ప్రొటీన్ బాడీకి కావల్సింది ఒక కేజీ బరువుకు 1.6 గ్రాములు. ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్లు ఇచ్చిన లెక్క ఇది. కానీ సిక్స్ ప్యాక్ కి ట్రై చేసే వాళ్లు 2-3 గ్రాములు చొప్పున తీసుకుంటారు. 4 గ్రాములు కూడా తీసుకుంటారు. ఎక్కువగా ప్రొటీన్ మీద ఆధారపడతారు.

అంతంత ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బాగా తగ్గిపోతుంది. ఫ్యాట్ అనేది 25-30 గ్రాములు కావాలి. కానీ వీళ్లు 10 గ్రాములు కూడా తీసుకోరు. కార్భోహైడ్రేట్స్ కూడా ఎనర్జీకి తగ్గట్టుగా 150-200 గ్రాములు అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్లు 10-20 గ్రాములు కార్భోహైడ్రేట్స్ కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. ప్రొటీన్ మాత్రం దగ్గరదగ్గర 200-300 గ్రాములు తీసుకుంటారు. అంత రివర్స్ లో చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.

ప్రొద్దునే ప్రొటీన్ షేక్ ఒక అరలీటర్ తాగుతారు. అది కృత్రిమంగా తయారుచేసింది. అందులో కార్భోహైడ్రైట్స్ ఉండవు, ఫ్యాట్స్ ఉండవు. అది ప్రొటీన్స్ మాత్రమే. అది ఫుల్ గా తాగేస్తారు. మధ్యాహ్నం ఆఫ్ డజన్ నుంచి డజన్ ఎగ్ వైట్స్ తినేస్తారు. ఎగ్ వైట్ అంటే..ఓన్లో ప్రొటీన్. 3 గ్రాములు ఉంటుంది ఒక ఎగ్ వైట్ లో. సాయంకాలం అచ్చంగా ఫ్యాట్ లేని చికెన్ తింటారు. ఛస్ట్ పీస్ లో అరకేజీ తీసుకుంటారు. బాగా ఎక్సర్ సజ్ చేస్తారు.

కానీ తక్కువ టైంలో ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయటం వల్ల బాడీ బాగా స్ట్రెయిన్ అవుతుంది. నూట్రియన్స్ ఉండవు. ఇవి లేకపోతే హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు. బ్రెయిన్ డవలప్మెంట్ కి ఫ్యాట్ కావాలి, సెల్ మెమరీలకు ఫ్యాట్ కావాలి. కాబట్టి కేవలం ప్రోటీన్ ఫుడ్ మాత్రమే కాకుండా.. సప్లిమెంట్స్ తీసుకోవాలి. అన్ని రకాల కాల్షియం డెఫీషియన్సీ, విటమిన్ డీ డెఫీషియన్సీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇన్ని రకాల హానీ కలిగించేవి డైట్ లో ఉంటాయి.

మరి ఈ డైట్ తో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి..దీనికి బదులుగా ఎప్పుడు ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి. ప్రకృతిపరంగా ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం.

ఇంటర్మీటెండ్ ఫాస్టింగ్ చేస్తూ..మార్నింగ్ 10 కి స్ప్రౌట్స్, కొబ్బరి, గ్రౌండ్ నట్స్ ఇట్లాంటివి తిని ఎక్సర్ సైజ్ చేయొచ్చు. సాయంకాలం వాలనట్స్, బాదం, పిస్తా,ఫ్రూట్స్ తీసుకుంటూ..ప్రోటీన్ షేక్ కి బదులు..సోయామిల్క్ తాగొచ్చు. వీటితో డైట్ చేస్తే..1సంవత్సరానికి ప్యాక్ వస్తుంది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెయింటేన్ చేయొచ్చు. హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే..సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారో..వారు ఓ సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news